Home

*షటిల్ క్రీడాకారుల కోసం ఉచిత గుండె వైద్య శిబిరం.* *క్రీడాకారుల ప్రాణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ.. ముందస్తు గుండె పరీక్షలతో భరోసా కల్పించిన డా. రామ్మూర్తి యాదవ్.*

సూర్యాపేట : నిత్యం తమతో కలిసి షటిల్ ఆడుతూ, నవ్వుతూ, సరదాగా గడిపిన తోటి క్రీడాకారుడు వెలుగు కర్ణాకర్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందడం సహచర క్రీడాకారులను తీవ్ర విషాదానికి గురిచేసింది. కళ్లముందే తిరిగిన ఆత్మీయ క్రీడాకారుడు ఇక లేడనే వార్త అందరినీ కలచివేసింది. ఇలాంటి విషాదకర పరిస్థితి మరే క్రీడాకారుడి కుటుంబంలోనూ చోటుచేసుకోకూడదనే మానవీయ ఆలోచనతో గాయత్రి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డా. ఊర రామమూర్తి యాదవ్ ముందడుగు వేశారు. తోటి క్రీడాకారుల ఆరోగ్యమే తన ఆరోగ్యంగా భావిస్తూ, షటిల్ ఆడే ప్రతి...

నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిలభారత కిసాన్ సభ 36వ మహాసభలను జయప్రదం చేయాలి

ముఖ్యమైన పాయింట్స్:నవంబర్ 15న ఎన్జీ కళాశాల మైదానంలో లక్షలాది మంది రైతులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభనవంబర్ 14న నిర్వహించే రైతు ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేయాలితెలంగాణ రైతు సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో అఖిలభారత కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపు సూర్యాపేట: నవంబర్ 15 నుంచి 18 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కేంద్రమైన నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని అఖిలభారత కిసాన్ సభ...

*దేశ చరిత్రలో చెరగని సంతకం.. ఇందిరాగాంధీ* *ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి ఘన నివాళి*

సూర్యాపేట: దేశ చరిత్రలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీది చెరగని స్థానమని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వారి నివాసంలో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు మరువలేనివని, ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని...

*రైతు పండించినవరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలి..* *కొనుగోలుదారుల దోపిడీని అరికట్టాలి.* *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్.*

సూర్యాపేట: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం తీసుకొస్తున్న రైతులకు తక్షణమే కనీస మద్దతు ధర కల్పించి, కొనుగోలుదారుల దోపిడీని అరికట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం శ్రమించి, పెట్టుబడులు పెట్టి పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొస్తే కనీస ధర కూడా దక్కని పరిస్థితి నెలకొనడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.గత వారం రోజులుగా సూర్యాపేట మార్కెట్‌కు వరి ధాన్యం వస్తున్నప్పటికీ, రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాల్సిన...

*ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లి సత్యనారాయణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి* * సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి*

Ll సూర్యాపేట: ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొల్లి సత్యనారాయణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ గత 42 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. అనేక మందికి న్యాయ సహాయం...

*పేదింటి గడపకు చేరుతున్న ఇందిరమ్మ ఇల్లు*

సూర్యాపేట: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని 22వ వార్డు రాజీవ్ నగర్‌లో కౌన్సిలర్ ఎల్గూరి అలివేలు చంటిబాబుతో కలిసి తండు అంజలి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల...

పేద ఆర్యవైశ్యులకు బాసటగా శ్రీ వాసవి రక్షణ కవచం

సూర్యాపేట : పేద ఆర్యవైశ్యులకు బాసటగా శ్రీ వాసవి రక్షణ కవచం నిలుస్తుందని శ్రీ వాసవి రక్షణ కవచం గౌరవ సలహాదారులు తప్సీ గాంధీ, కలకోట లక్ష్మయ్య, చల్లా సత్యనారాయణ లు తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి సేవాసమితి కార్యాలయంలో సూర్యాపేటకు చెందిన పేద ఆర్య వైశ్యులు బెలిదే చంద్రశేఖర్ , పద్మ దంపతులకు పదివేల రూపాయల విలువగల సైకిల్, బీరువా, రెండు వాటర్ క్యాన్లు శ్రీ వాసవి రక్షణ కవచం వ్యవస్థాపకులు బచ్చు పురుషోత్తం తో కలిసి అందజేశారు....

*మూసి నీటిని క్రమబద్ధీకరించాలి.* *తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి*

సూర్యాపేట : మూసి నీటిని క్రమబద్ధీకరించి రైతాంగానికి రెండో పంటకు నీరు అందించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి కోరారు. బుధవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మూసి ప్రాజెక్టు ఎస్ సి నాగభూషణ రావు కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసి ప్రాజెక్టు ద్వారా నీరు ఎక్కువ మొత్తంలో విడుదల చేయటం వల్ల రెండవ పంటకు సాగునీరు అందే పరిస్థితి ఉండదని దీని మూలంగా రైతాంగ రెండవ పంటకు సాగునీటికి ప్రమాదం...

మానవ కర్మలను తొలగించేందుకు రుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞం

ముఖ్యమైన పాయింట్స్:- డిసెంబర్ 1న 1116 మంది దంపతులచే నిర్వహణ* భక్త జనులు, పేదల కోసమే యజ్ఞ యాగాలు చేయడానికే ఈ మహా యజ్ఞం* శ్రీ బాల మానస మహా విద్యాపీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ సద్గురు భవాని స్వామి సూర్యాపేట : హిందూ ధర్మంలో ప్రతి హిందువు సంవత్సరానికి ఒక్కసారైనా యజ్ఞం వ్రతం నిర్వహించాలని వేదాలు చెబుతున్నాయని ఏ హోమము, వ్రతాలు చేయలేని భక్తజనులు, పేదల కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ బాల మానస మహా విద్యాపీఠం ఆధ్వర్యంలో శ్రీ...

*రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్* *వ్యాపారుల* *సమస్యలు పరిష్కరించాలి,* తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

ముఖ్యమైన పాయింట్స్:*పది వేలు రూపాయలు కట్టిన* *ఎల్ఆర్ఎస్ పై* *ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.**పట్టా పాస్ బుక్ నుంచి వెంచర్ల రిజిస్ట్రేషన్ కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు.* సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని పది వేలు రూపాయలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం లో విలేకరులతో మాట్లాడారు....

- *పోలీసు అమరులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి.* - *పోలీసు త్యాగాలకు గౌరవంగా ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి.* నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా. *బైక్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న పట్టణ పౌరులు, యువత*

సూర్యాపేట : పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఖమ్మం చౌరస్తా నుండి పిఎస్ఆర్ సెంటర్, కోర్టు చౌరస్తా మీదుగా ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల చౌరస్తా వరకు పోలీసు అమరుల సంస్మరణ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ అధికారులతో కలిసి జిల్లా కేంద్రం లోని ఖమ్మం చౌరస్తా వద్ద బైక్ ర్యాలీ ప్రారంభించారు. పిఎస్అర్ సెంటర్, కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా మీదుగా ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వరకు జరిగినది....

కలలకు జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది పేటలో అలరించిన స్వర గానామృతం గాయకులకు షీల్డ్ లు అందజేసి సత్కరించిన ప్రముఖ వైద్యులు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్

సూర్యాపేట టౌన్ : సమాజంలో అంతరించిపోతున్న కలలకు జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నేడు ఆపాత మధురాలను గుర్తు చేస్తూ స్వర గానామృతం నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో జ్ఞాన సరస్వతి కళావేదిక, జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర గానామృతం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి గాయకులకు షీల్డులు ప్రశంస పత్రాలు అందజేసి సత్కరించారు. ఆనాటి పాటలు...

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

ముఖ్యమైన పాయింట్స్:ఈ ఏడాది వరి ధాన్యానికి క్వింటాల్ కు 3వేలు పైచిలుకు పైగా మద్దతు ధరఐదు రూపాయల భోజనం పరిశీలన సూర్యాపేట: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని దేశానికి వెన్నెముకైన రైతాంగానికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 78 వేల వరి ధాన్యం వచ్చినా గాని వరి ధాన్యానికి మూడు వేలకు పైచిలుకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మద్దతు కల్పిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఐదు రూపాయల భోజనం ఏర్పాట్లు, రైతుల కల్పిస్తున్న...

జ్ఞానంతోనే మనిషి జీవితంలో మార్పు: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట : జ్ఞానంతోనే మనిషి జీవితంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాధారణ జీవితం నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి జ్ఞానం ఎంతో అవసరమని కలెక్టర్ చెప్పారు. జ్ఞానాన్ని సంపాదించడంతో పాటు దానిని ఆచరణలో పెట్టినప్పుడే వ్యక్తిగతంగా, సామాజికంగా మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. మనలో మార్పు...

*నవంబర్ 15–18 వరకు నల్లగొండలో 36వ మహాసభలు.. రైతాంగం పెద్దఎత్తున తరలిరావాలి* *సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపు*

సూర్యాపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరగనున్న అఖిలభారత రైతు సంఘం (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చ జరిపి, రైతుల హక్కుల సాధన కోసం భవిష్యత్ పోరాటాలకు ఈ మహాసభలు దిశానిర్దేశం చేయనున్నాయని తెలిపారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సమావేశం జరిగింది....

*ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేసుకోవాలి* *కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న*

సూర్యాపేట:ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో 48వ వార్డులో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్గొండ,ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రాన్ని సందర్శించి ఓటు నమోదు సరళిని పరిశీలించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదన్నారు. ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించడంతో పాటు, నమోదు ప్రక్రియలో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఇలాంటి కేంద్రాలు...

- రక్తదానం ప్రాణదానం తో సమానం - పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా రక్తదానం కార్యక్రమం ఏర్పాటు. - సేవా కార్యక్రమాలలో పోలీసు ముందడుగు. నరసింహ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా.

సూర్యాపేట : పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగాల జ్ఞాపకార్థం సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ రక్తదాన శిబిరం నందు జిల్లా ఎస్పీ పాల్గొని మొదటగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్పి గారి వెంట డీఎస్పీ నరసింహ చారి, నాగారం సిఐ నాగేశ్వరరావు, సిఐ లు రామారావు, శివ కుమార్, ఆర్ఐ లు ప్రవీణ్, జానయ్య, ఎస్ఐ లు సిబ్బంది రక్తదానం చేశారు. ఈ...

ప్రివిలేజ్ ట్యాక్స్ పెంపు నిరసనతో.. జిల్లాలో మూతపడిన బార్లు

సూర్యాపేట : బార్ అండ్ రెస్టారెంట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రివిలేజ్ ట్యాక్స్ పెంచడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం జిల్లాలో బార్లు బంద్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలో ఉదయం నుంచి బార్లు మూతపడ్డాయి..ఈ సందర్భంగా జిల్లా బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ నాయకులు గవ్వ కృష్ణారెడ్డి, రంగరాజు రుక్మారావు లు మాట్లాడుతూ, బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. పన్నులు పెంచడం వల్ల బార్ యజమానులు తీవ్ర ఆర్థిక...

కలలకు జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది పేటలో అలరించిన స్వర గానామృతం గాయకులకు షీల్డ్ లు అందజేసి సత్కరించిన ప్రముఖ వైద్యులు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్

సూర్యాపేట : సమాజంలో అంతరించిపోతున్న కలలకు జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నేడు ఆపాత మధురాలను గుర్తు చేస్తూ స్వర గానామృతం నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో జ్ఞాన సరస్వతి కళావేదిక, జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర గానామృతం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి గాయకులకు షీల్డులు ప్రశంస పత్రాలు అందజేసి సత్కరించారు. ఆనాటి పాటలు ఎంతో...

కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట : ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రైతులు ఆరుతడి పంటలైన కూరగాయలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందించే రాయితీలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో రెండు ఎకరాల్లో వంగ, మునగ తోటలు సాగు చేస్తున్న బోయపల్లి సరోజ వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు. వంగ, మునగ సాగులో లాభనష్టాలను రైతును అడిగి...