Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్* *వ్యాపారుల* *సమస్యలు పరిష్కరించాలి,* తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

Author
Posted By RK SAKSHI
| 28 Oct 2026, 04:41 PM | TELANGANA
*రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్* *వ్యాపారుల* *సమస్యలు పరిష్కరించాలి,*   తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

ముఖ్యమైన పాయింట్స్:

  • *పది వేలు రూపాయలు కట్టిన* *ఎల్ఆర్ఎస్ పై* *ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.*
  • *పట్టా పాస్ బుక్ నుంచి వెంచర్ల రిజిస్ట్రేషన్ కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు.*


సూర్యాపేట :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని పది వేలు రూపాయలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం లో విలేకరులతో మాట్లాడారు. పాత వెంచర్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ కొరకు ఎదురుచూస్తున్న ప్రజలు ప్రభుత్వం పది వేల రూపాయలు మీ సేవ ద్వారా ఎల్ఆర్ఎస్ కొరకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కట్టించుకొన్న ప్రభుత్వం నేటికీ దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. పట్టా పాస్ బుక్ పై ఒక ఎకరం రెండు ఎకరాలు లోపు ఉన్న భూములను నాలా కన్వెన్షన్ మీద ప్లాట్ నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసే విధంగా ప్రభుత్వం నూతన జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. పేదలు వారి కుటుంబ అవసరాల నిమిత్తం,కూతుళ్ళ పెళ్లిళ్ల కోసం ఒక్కొక్క రూపాయి వెనకేసుకొని చిన్నపాటి భూములను కొనుగోలు చేశారన్నారు.అట్టి భూములపై కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసేందుకు వెనకాడితే పేదలు మరింత ఆర్ధిక కూబిలోకి వెళ్లే ఆస్కారం ఉందన్నారు. ఒక ఎకరం పైబడిన భూములపై నాలా కన్వర్షన్ మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. భూముల కొనుగోలుపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి నేడు దీన స్థితికి దిగజారారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూమిని తమ అవసరాల కోసం గ్రామపంచాయతీ పట్టా పాస్ బుక్ నుండి లేఔట్లలో ఫ్లాట్లకు నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానిని కూడా పునరాలోచించి యజమనూలు తమకి అవసరం ఉన్నంత వరకే అమ్ముకునే వెసలుబాటు గతంలో ఉన్నట్లే కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు అని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో వంద గజాల ప్లాట్ లకు 18 వెడల్పు 20 వెడల్పు ఉన్నటువంటి ఫ్లాట్లకు పరిమిషన్ ఇవ్వడం లేదు అని ప్రభుత్వం పై మండిపడ్డారు. ప్రభుత్వం వీటిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే కొందరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సూర్యాపేట జిల్లాలో 14వ వార్డు లొ కృష్ణ కాలనీలో గత 20 సంవత్సరాల క్రితమే 8 గంటల స్థలం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కోసం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 142 సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు కేవలం కొన్ని మాత్రమే సొంత భవనాలు ఉన్నాయన్నారు. మిగతావి అద్దె భవనాలకు ఉంటున్నాయన్నారు. కావున అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పక్కా సొంత భవనాలు ఏర్పాటు చేయాలని అన్నారు. నూతన భవనాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ధరణి వెబ్సైట్లో పాత డిజిటల్ ను యాప్ తీసేసారని, అలా తీయడం వల్ల రైతులకు పేర్లు ఆన్లైన్లో రావట్లేదు వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. పది వేల రూపాయలు కట్టిన ఎల్ ఆర్ ఎస్ ను పరిష్కరించాలి అన్నారు. వెంచర్ల ప్లాట్లను నాలా కన్వెన్షన్ కింద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునరాలోచించి మరో నూతన జీఓని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సూర్యాపేట రియల్ ఎస్టేట్ జిల్లా అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్,రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రావణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అయితగాని మల్లయ్య గౌడ్, వెంకన్న, ఆకుల మారయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి పట్టేటి కిరణ్, రాపర్తి జానయ్య తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి. ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి. తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.