Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ప్రివిలేజ్ ట్యాక్స్ పెంపు నిరసనతో.. జిల్లాలో మూతపడిన బార్లు

Author
Posted By RK SAKSHI
| 26 Oct 2026, 01:13 PM | TELANGANA
ప్రివిలేజ్ ట్యాక్స్ పెంపు నిరసనతో..  జిల్లాలో మూతపడిన బార్లు

సూర్యాపేట : బార్ అండ్ రెస్టారెంట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రివిలేజ్ ట్యాక్స్ పెంచడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం జిల్లాలో బార్లు బంద్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలో ఉదయం నుంచి బార్లు మూతపడ్డాయి..ఈ సందర్భంగా జిల్లా బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ నాయకులు
గవ్వ కృష్ణారెడ్డి, రంగరాజు రుక్మారావు లు మాట్లాడుతూ, బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. పన్నులు పెంచడం వల్ల బార్ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే పెంచిన ప్రివిలేజ్ ట్యాక్స్ను తగ్గించాలని, బార్ యజమానులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో బార్ యాజమాన్యం మోదుగు కృష్ణారెడ్డి, కె హరి ప్రసాద్, మండాది శ్రీనివాస్, రాపర్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.