Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*నవంబర్ 15–18 వరకు నల్లగొండలో 36వ మహాసభలు.. రైతాంగం పెద్దఎత్తున తరలిరావాలి* *సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపు*

Author
Posted By RK SAKSHI
| 26 Oct 2026, 04:29 PM | Politics
*నవంబర్ 15–18 వరకు నల్లగొండలో 36వ మహాసభలు..   రైతాంగం పెద్దఎత్తున తరలిరావాలి*     *సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపు*

సూర్యాపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరగనున్న అఖిలభారత రైతు సంఘం (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చ జరిపి, రైతుల హక్కుల సాధన కోసం భవిష్యత్ పోరాటాలకు ఈ మహాసభలు దిశానిర్దేశం చేయనున్నాయని తెలిపారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, నవంబర్ 15న నల్లగొండ జిల్లా కేంద్రంలో లక్షలాది మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరై మూడు రోజులపాటు రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగ సంక్షోభం, రైతుల హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతోందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతాంగానికి నష్టం కలిగించే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా వ్యవసాయ రంగాన్ని ఎలా కాపాడతారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేసి రైతులకు ఊరట కల్పించాలని, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఎండిపోయిన వరి పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు తక్షణమే కరువు సహాయం అందించాలని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
వరి, పత్తి, మిర్చి పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని, వ్యవసాయానికి రోజుకు 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంటలు చేతికొచ్చే సమయంలో రైతులను విద్యుత్ కోతలు, సాగునీటి కొరత, కరువు పరిస్థితులు తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని అన్నారు.వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదని, గ్రామాల్లో ఉపాధి హామీ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు తగిన కూలి చెల్లించి, గ్రామీణ పేదలకు జీవన భద్రత కల్పించాలని అన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సంఘటిత పోరాటాలు అవసరమని పేర్కొంటూ, నల్లగొండలో జరిగే అఖిలభారత రైతు సంఘం మహాసభలకు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగారపు పాండు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టి పెల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి. ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి. తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.