Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేసుకోవాలి* *కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న*

Author
Posted By RK SAKSHI
| 26 Oct 2026, 02:33 PM | Politics
*ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేసుకోవాలి*   *కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న*

సూర్యాపేట:ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో 48వ వార్డులో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్గొండ,ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రాన్ని సందర్శించి ఓటు నమోదు సరళిని పరిశీలించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదన్నారు. ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించడంతో పాటు, నమోదు ప్రక్రియలో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఇలాంటి కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన పట్టభద్రులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం ఉమ్మడి నల్లగొండ -ఖమ్మం–వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి మద్దతు తెలిపి, ఆయన విజయానికి కృషి చేయాలని పట్టభద్రులను కోరారు. ఆయన వెంట నాయకులు కోల నాగరాజు, ఈర్ల వాసు, ఉపేందర్ ఆపరేటర్ లింగరాజు, తదితరులు ఉన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.