Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లి సత్యనారాయణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి* * సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి*

Author
Posted By RK SAKSHI
| 29 Oct 2026, 03:58 PM | Politics
*ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లి సత్యనారాయణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి*    * సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి*

Ll
సూర్యాపేట: ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొల్లి సత్యనారాయణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ గత 42 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. అనేక మందికి న్యాయ సహాయం అందించడంతో పాటు నిరుద్యోగ యువత, కార్మికులు, విద్యార్థులు, రైతుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారని అన్నారు. మూడుసార్లు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడారని పేర్కొన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ న్యాయవాద వృత్తిలో ఎదురవుతున్న సమస్యలపై అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారని తెలిపారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను శాసనమండలికి పంపించడం ద్వారా ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు, మేధావులు, అభ్యుదయవాదులు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలని కోరారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్‌ఐఆర్‌ (సర్ ) ప్రక్రియపై మల్లు నాగార్జున రెడ్డి విమర్శలు చేశారు. ఈ ప్రక్రియ ద్వారా పేదలు, వలస కార్మికులు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కేలా చూడాలని, ఓటర్ల జాబితా నుంచి అన్యాయంగా పేర్లు తొలగించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.భారత రాజ్యాంగంలోని సామ్యవాదం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం వంటి మౌలిక విలువలకు, సామాజిక న్యాయం, రిజర్వేషన్లకు బీజేపీ విధానాలు ముప్పు కలిగిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజల హక్కుల సాధనకు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని, ఓటరు నమోదు కేంద్రం నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్ లైన్ జిల్లా నాయకులు ఎర్ర అఖిల్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, జిల్లా ప్రజా సంఘాల బాధ్యులు వేల్పుల వెంకన్న, జె. నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, మేకనబోయిన శేఖర్, మద్దెల జ్యోతి, బొమ్మిడి లక్ష్మీనారాయణ, మేకనబోయిన సైదమ్మ, ఉప్పుల రమేష్, కందిబండ ఉపేందర్, వెలుగు మధు తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి. ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి. తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.