Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

సూర్యాపేట లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..

Author
Posted By RK SAKSHI
| 19 Oct 2026, 05:03 AM | Bhakti
సూర్యాపేట లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు..  వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..

సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణంలోని రైతు బజార్, సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద జరిగిన బతుకమ్మ వేడుకలలో ఆయన పాల్గొని తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున సెల్ఫీలు దిగి సందడి చేశారు. అనంతరం ఆయన సతీమణి గుంటకండ్ల సునీత, కుమారుడు వేమన్ రెడ్డి లతో కలిసి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో అయనతో పాటు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ జడ్పీటీసీ జీడీ బిక్షం, మున్సిపల్ ప్లార్ లీడర్ అంగీరేకుల నాగార్జున, కౌన్సిలర్లు తాహెర్, ఈద ప్రవీణ్, సైదులు, సందీప్ లతో పాటు మాజీ కౌన్సిలర్లు, మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సూర్యాపేట లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు..  వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. - Additional Image
అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.