సూర్యాపేట లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణంలోని రైతు బజార్, సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద జరిగిన బతుకమ్మ వేడుకలలో ఆయన పాల్గొని తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున సెల్ఫీలు దిగి సందడి చేశారు. అనంతరం ఆయన సతీమణి గుంటకండ్ల సునీత, కుమారుడు వేమన్ రెడ్డి లతో కలిసి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో అయనతో పాటు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జిల్లా గ్రంధాలయం...