Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి. ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి. తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

Author
Posted By RK SAKSHI
| 18 Sep 2026, 01:39 PM | TELANGANA
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

సూర్యాపేట :
హైదరాబాదు నుండి సూర్యాపేట మీదుగా అమరావతికి బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుల్లెట్ ట్రైన్ కు మార్గం కల్పించాలని కోరుతూ సూర్యాపేట బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల రోజులుగా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడి సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట మీదుగా ట్రైన్ సౌకర్యం కల్పిస్తే హైదరాబాద్ విజయవాడ,అమరావతి నగరాలకు మధ్యలో ఉన్న సూర్యాపేట ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. సూర్యాపేట ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ సౌకర్యం కల్పిస్తే పట్టణాభివృద్ధి తో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు అందరూ పార్లమెంటులో, అసెంబ్లీలో ఈ ప్రాంత ప్రజల పక్షాన ట్రైన్ సౌకర్యం కల్పించాలని గొంతు ఎత్తాలని, అవసరమైతే రాజీనామాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రం లో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి , ఖమ్మంపాటి అంజయ్య, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రవణ్, జిల్లా ఉపాధ్యక్షులు అయితగాని మల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.