Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ఉప్పల మల్సూరు కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడం ఎంసీపీఐ యూ పోరాట ఫలితమే. ఎం సిపిఐ యూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వరికుప్పల వెంకన్న

Author
Posted By RK SAKSHI
| 18 Sep 2026, 01:22 PM | Politics
ఉప్పల మల్సూరు కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడం ఎంసీపీఐ యూ పోరాట ఫలితమే.  ఎం సిపిఐ యూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వరికుప్పల వెంకన్న

సూర్యాపేట :
సూర్యాపేట తొలి శాసనసభ్యుడు అమరజీవి కామ్రేడ్ ఉప్పల మలుసూరు ఎక్స్ ఎమ్మెల్యే గారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయటం ఎం సిపిఐయు పోరాట ఫలితమే అని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న అన్నారు. ఎం సిపిఐయు ఆధ్వర్యంలో అనేక సందర్భాలలో వారి కుటుంబ పరిస్థితులపై కుటుంబ సభ్యులను తీసుకుని కలెక్టర్ల గారిని ప్రజా ప్రతినిధులను స్వయంగా కలిసిన విషయం మీడియా మిత్రులకు ప్రజలకు తెలుసునని వినతి పత్రాలు అర్జీలు సమర్పించడం జరిగిందని వెంకన్న అన్నారు.1952 నుండి 1972 వరకు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్నికై తాను నమ్ముకున్న వృత్తిని కొనసాగిస్తూ 1995లో సిరికొండ గ్రామానికి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికై .1999 జనవరి 13న మరణించారని వెంకన్న గుర్తు చేశారు. వారి ప్రధమ వర్ధంతి సందర్భంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి మాజీ ఎంపీ గారి నాయకత్వాన ఆనాటి ఆనాటి సూర్యాపేట శాసనసభ్యులు దోసపాటి గోపాల్ ఆధ్వర్యంలో ఎం సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ గారి మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా సిరికొండ గ్రామంలో వారి స్థూపాన్ని ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. 2016 వ సంవత్సరంలో సిరికొండ రైతుబిడ్డ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారి సహకారంతో నూకల వెంకటరామిరెడ్డి మాజీ సర్పంచ్ ఎం సిపిఐ యూ జిల్లా నాయకులు నాయకత్వాన ఆనాటి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి చేతుల మీదుగా వారి నిలువత్తు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని వెంకన్న తెలిపారు. మన్సూర్ గారు మరణించేంతవరకు ఆటోలో బస్సులలో ప్రయాణిస్తూ ఆస్తులు అంతస్తులు సంపాదించుకోకుండా తాను మరణించక ముందే తన సొంత ఇంటి స్థలాన్ని సిరికొండ ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా అందించిన ఆదర్శమూర్తి.
మన్సూర్ గారు. మరణించి నేటికీ 26 సంవత్సరాలకు ఇల్లు మంజూరు చేయటం అర్షనీయం .వారి యొక్క విగ్రహాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వరికుప్పల వెంకన్న విజ్ఞప్తి చేశారు.

ఉప్పల మల్సూరు కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడం ఎంసీపీఐ యూ పోరాట ఫలితమే.  ఎం సిపిఐ యూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వరికుప్పల వెంకన్న - Additional Image
అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.