🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 19 October 2026, 5:03 am Posted by : RK SAKSHI

సూర్యాపేట లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..

News Image

సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణంలోని రైతు బజార్, సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద జరిగిన బతుకమ్మ వేడుకలలో ఆయన పాల్గొని తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున సెల్ఫీలు దిగి సందడి చేశారు. అనంతరం ఆయన సతీమణి గుంటకండ్ల సునీత, కుమారుడు వేమన్ రెడ్డి లతో కలిసి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో అయనతో పాటు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ జడ్పీటీసీ జీడీ బిక్షం, మున్సిపల్ ప్లార్ లీడర్ అంగీరేకుల నాగార్జున, కౌన్సిలర్లు తాహెర్, ఈద ప్రవీణ్, సైదులు, సందీప్ లతో పాటు మాజీ కౌన్సిలర్లు, మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
🏠 Home