Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక* *కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో బతుకమ్మను పేర్చిన డీసీసీ కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్‌*

Author
Posted By RK SAKSHI
| 10 Oct 2026, 04:31 PM | Bhakti
*బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక*  *కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో బతుకమ్మను పేర్చిన డీసీసీ కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్‌*

సూర్యాపేట: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని డీసీసీ కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్‌ అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తన తల్లి, చెల్లి, బావ, భార్య, బిడ్డతో కలిసి తన ఇంట్లో బతుకమ్మను పేర్చే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రకృతితో మమేకమైన గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సంబరాలు జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు.
పండుగ సందర్భంగా తెలంగాణలోని మహిళలు, యువతులు కాలనీలు, కూడళ్లు, గ్రామాలు, చెరువుల వద్ద పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి బతుకమ్మ ఆడుతూ సందడి చేస్తారని తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో విడదీయలేని భాగమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి బతుకమ్మను పేర్చడం ఆనందాన్ని కలిగించడంతోపాటు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు, తెలంగాణ ఆడపడుచులకు కక్కిరేణి శ్రీనివాస్‌ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.