*బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక* *కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో బతుకమ్మను పేర్చిన డీసీసీ కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్‌*

సూర్యాపేట: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని డీసీసీ కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్‌ అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తన తల్లి, చెల్లి, బావ, భార్య, బిడ్డతో కలిసి తన ఇంట్లో బతుకమ్మను పేర్చే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రకృతితో మమేకమైన గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సంబరాలు జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు. పండుగ సందర్భంగా తెలంగాణలోని మహిళలు, యువతులు కాలనీలు, కూడళ్లు, గ్రామాలు,...