*ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లి సత్యనారాయణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి* * సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి*
Ll సూర్యాపేట: ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొల్లి సత్యనారాయణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ గత 42 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. అనేక మందికి న్యాయ సహాయం అందించడంతో పాటు నిరుద్యోగ యువత, కార్మికులు, విద్యార్థులు, రైతుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారని అన్నారు. మూడుసార్లు బార్...