*నవంబర్ 15–18 వరకు నల్లగొండలో 36వ మహాసభలు.. రైతాంగం పెద్దఎత్తున తరలిరావాలి* *సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపు*
సూర్యాపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరగనున్న అఖిలభారత రైతు సంఘం (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చ జరిపి, రైతుల హక్కుల సాధన కోసం భవిష్యత్ పోరాటాలకు ఈ మహాసభలు దిశానిర్దేశం చేయనున్నాయని తెలిపారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, నవంబర్ 15న నల్లగొండ జిల్లా కేంద్రంలో లక్షలాది మంది రైతులతో భారీ బహిరంగ...