*ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేసుకోవాలి* *కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న*
సూర్యాపేట:ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో 48వ వార్డులో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్గొండ,ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రాన్ని సందర్శించి ఓటు నమోదు సరళిని పరిశీలించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదన్నారు. ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించడంతో పాటు, నమోదు ప్రక్రియలో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఇలాంటి కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన పట్టభద్రులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం ఉమ్మడి నల్లగొండ -ఖమ్మం–వరంగల్ జిల్లాల...