ప్రివిలేజ్ ట్యాక్స్ పెంపు నిరసనతో.. జిల్లాలో మూతపడిన బార్లు
సూర్యాపేట : బార్ అండ్ రెస్టారెంట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రివిలేజ్ ట్యాక్స్ పెంచడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం జిల్లాలో బార్లు బంద్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలో ఉదయం నుంచి బార్లు మూతపడ్డాయి..ఈ సందర్భంగా జిల్లా బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ నాయకులు గవ్వ కృష్ణారెడ్డి, రంగరాజు రుక్మారావు లు మాట్లాడుతూ, బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. పన్నులు పెంచడం వల్ల బార్ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే పెంచిన ప్రివిలేజ్ ట్యాక్స్‌ను తగ్గించాలని, బార్ యజమానులకు న్యాయం చేయాలని...