Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్

Author
Posted By RK SAKSHI
| 19 Oct 2026, 02:45 PM | Bhakti
జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు   ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్

ముఖ్యమైన పాయింట్స్:

  • - చెడు నశించి.. మంచి వర్ధిల్లాలి.. సమాజంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలి.
  • - దసరా పండుగ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించిన ఎస్పీ

సూర్యాపేట, అక్టోబర్ 19:

జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు   ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ - Additional Image

జిల్లా ప్రజలందరికీ విజయదశమి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. చెడు నశించి మంచి వర్ధిల్లాలని, సమాజంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ఆకాంక్షించారు. దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఆయుధ పూజ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని పోలీస్ ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ ఆయుధాలు, వాహనాలు కీలక పాత్ర కలిగివున్నాయి తెలిపారు. పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణలో ఆయుధాలు, వాహనాలు ఎంతో అవసరమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతలను కాపాడటంలో ఇవి ముఖ్యమైన సాధనాలని పేర్కొన్నారు. విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ చెడును విడనాడి మంచిని స్వాగతించాలని సూచించారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మరోసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజు భార్గవి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, రవి, ఇన్‌స్పెక్టర్లు రామారావు, రాజశేఖర్, వెంకటయ్య, మగ్దుమ్ అలీ, ప్రవీన్ కుమార్, జానయ్య, శివకుమార్, నారాయణరాజు, ఎస్‌ఐలు, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.