జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్

ముఖ్యమైన పాయింట్స్:- చెడు నశించి.. మంచి వర్ధిల్లాలి.. సమాజంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలి.- దసరా పండుగ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించిన ఎస్పీ సూర్యాపేట, అక్టోబర్ 19: జిల్లా ప్రజలందరికీ విజయదశమి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. చెడు నశించి మంచి వర్ధిల్లాలని, సమాజంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ఆకాంక్షించారు. దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఆయుధ పూజ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని పోలీస్ ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ ఆయుధాలు, వాహనాలు కీలక పాత్ర...