Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలి!* *ఢిల్లీలో సీపీఎం నాయకుల అరెస్టు దుర్మార్గం....* *సూర్యాపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం*

Author
Posted By RK SAKSHI
| 11 Oct 2026, 04:00 PM | Politics
*సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలి!*   *ఢిల్లీలో సీపీఎం నాయకుల అరెస్టు దుర్మార్గం....*   *సూర్యాపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం*

సూర్యాపేట: ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌–సర్ ) ప్రక్రియను నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సీపీఎం అఖిల భారత నాయకులతో పాటు తెలంగాణకు చెందిన పలువురు నాయకులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్‌లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులనుఅణచివేయడమేనని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్‌ చేశారు. ఓటు హక్కు పరిరక్షణకు ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని, ప్రజల్లో ఆందోళనలు, అనుమానాలు కలిగిస్తున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం వామపక్షాలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, జె. నరసింహారావు, మద్దెల జ్యోతి, ప్రజాసంఘాల నాయకులు మడ్డి అంజిబాబు, మల్లయ్య, వెంకన్న, పాషా, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.