*సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలి!* *ఢిల్లీలో సీపీఎం నాయకుల అరెస్టు దుర్మార్గం....* *సూర్యాపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం*
సూర్యాపేట: ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–సర్ ) ప్రక్రియను నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సీపీఎం అఖిల భారత నాయకులతో పాటు తెలంగాణకు చెందిన పలువురు నాయకులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య...