Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*ఆర్టీఐ అమలులో సూర్యాపేట జిల్లాకు అరుదైన గౌరవం* *రాష్ట్రంలోనే 'ఉత్తమ జిల్లా'గా ఎంపిక* *గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందజేత*

Author
Posted By RK SAKSHI
| 09 Oct 2026, 07:39 PM | TELANGANA
*ఆర్టీఐ అమలులో సూర్యాపేట జిల్లాకు అరుదైన గౌరవం* *రాష్ట్రంలోనే 'ఉత్తమ జిల్లా'గా ఎంపిక*  *గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందజేత*

సూర్యాపేట :
సమాచార హక్కు చట్టం అమలులో సూర్యాపేట జిల్లా రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. పారదర్శకమైన పాలన, వేగవంతమైన సమాచార వేదికగా నిలవడంతో సూర్యాపేటను “ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, శుక్రవారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల వారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు .
*పారదర్శక పాలనకు దక్కిన గుర్తింపు*
ప్రజాస్వామ్యంలో పౌరులకు సమాచార హక్కు చట్టం ద్వారా వేగవంతమైన, ఖచ్చితమైన సేవలు అందిస్తూ, వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో సూర్యాపేట జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపింది. జిల్లా అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్టీఐ దరఖాస్తులను సమర్థవంతంగా పరిష్కరించడం వల్లే ఈ అరుదైన గుర్తింపు సాధ్యమైందని అధికారులు తెలిపారు.
*అభినందనల వెల్లువ*
రాష్ట్రంలోనే అత్యుత్తమ జిల్లాగా ఎంపికై అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌కు జిల్లా అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు హృదయపూర్వక అభినందనలు తెలిపినారు.
అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, సిపిఓ కిషన్, సిఎఫ్ఓ దామోదర్ రెడ్డి, ఆర్టీవో పురుషోత్తమ రెడ్డి, డిపిఆర్ఓ వల్లోజి శ్రీనివాసరావు డిడి అడల్ట్ ఎడ్యుకేషన్ సిహెచ్.అనిల్ కుమార్, ఇడి ఎస్ సి కార్పొరేషన్ ఉపేందర్, డిఎస్ డిఓ వెంకట్ రెడ్డి, డిఐఇఓ సులోచన రాణీ, జిఎమ్ ఇండస్ట్రీస్ భారతి, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.