*ఆర్టీఐ అమలులో సూర్యాపేట జిల్లాకు అరుదైన గౌరవం* *రాష్ట్రంలోనే 'ఉత్తమ జిల్లా'గా ఎంపిక* *గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందజేత*

సూర్యాపేట : సమాచార హక్కు చట్టం అమలులో సూర్యాపేట జిల్లా రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. పారదర్శకమైన పాలన, వేగవంతమైన సమాచార వేదికగా నిలవడంతో సూర్యాపేటను “ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, శుక్రవారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల వారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు . *పారదర్శక పాలనకు దక్కిన గుర్తింపు* ప్రజాస్వామ్యంలో పౌరులకు సమాచార హక్కు చట్టం ద్వారా వేగవంతమైన, ఖచ్చితమైన సేవలు అందిస్తూ, వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో సూర్యాపేట జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపింది. జిల్లా అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్టీఐ...