Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

వికాస్ ఫార్మసీ నూతన విద్యార్థుల స్వాగత పరిచయ సభ...

Author
Posted By RK SAKSHI
| 08 Oct 2026, 07:03 PM | TELANGANA
వికాస్ ఫార్మసీ నూతన విద్యార్థుల స్వాగత పరిచయ సభ...

సూర్యాపేటరూరల్ :
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 120 ఫార్మసీ కళాశాలలో వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసోటికల్ సైన్సెస్ మొదటి పది స్థానాల్లో నిలిచి విజయాలని సాధించిందని మహారాష్ట్ర ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎంఎస్ సుధాకర్ బాబు అన్నారు. గురువారం స్థానిక వికాస్ ఫార్మసీ కాలేజీలో నూతన విద్యార్థులకు నిర్వహించిన స్వాగత పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గత 20 ఏళ్లుగా వికాస్ ఫార్మసీ కళాశాల నుంచి వేల కొలది విద్యార్థులు మంచి స్థానాల్లో స్థిరపడ్డారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫార్మసీ కళాశాలల సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కే. రామదాసు మాట్లాడుతూ...
గత 23 ఏళ్లుగా వికాస్ ఫార్మసీ కళాశాల ఎన్నో విజయాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా జరిగే అనేక ఫార్మసీ సదస్సులకు ఉత్సవాలకు వికాస్ విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. కళాశాల కరస్పాండెంట్ సాదినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం ఆశయాలకు తగినట్లుగా ఫార్మసీ కోసం కన్న కలల్ని విద్యార్థులు విజయవంతంగా ముందుకు తీసుకుని వెళుతున్నారని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆడపు రమేష్ మాట్లాడుతూ.. వికాస్ ఫార్మసీ కళాశాల ఇటీవలే అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ తో శిక్షణ ఒప్పంద కార్యక్రమాలను కుదుర్చుకుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నీలమ్మ, డాక్టర్ స్వరూప, నటేష్,గుంటూరు నవీన్ కుమార్, డాక్టర్ నరసింహారావు, దేవులపల్లి వినయ్ కుమార్,డాక్టర్ రమేష్, ఫర్ హిన్, మహేష్, సుజాత, సమత,భవాని రాజకుమార్, స్రవంతి ,పుష్పకుమారి పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థినీ, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పరిచయ కార్యక్రమం సజావుగా సాగింది. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అల్లరించాయి.

వికాస్ ఫార్మసీ నూతన విద్యార్థుల స్వాగత పరిచయ సభ... - Additional Image
అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.