వికాస్ ఫార్మసీ నూతన విద్యార్థుల స్వాగత పరిచయ సభ...

సూర్యాపేటరూరల్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 120 ఫార్మసీ కళాశాలలో వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసోటికల్ సైన్సెస్ మొదటి పది స్థానాల్లో నిలిచి విజయాలని సాధించిందని మహారాష్ట్ర ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎంఎస్ సుధాకర్ బాబు అన్నారు. గురువారం స్థానిక వికాస్ ఫార్మసీ కాలేజీలో నూతన విద్యార్థులకు నిర్వహించిన స్వాగత పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గత 20 ఏళ్లుగా వికాస్ ఫార్మసీ కళాశాల నుంచి వేల కొలది విద్యార్థులు మంచి స్థానాల్లో స్థిరపడ్డారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫార్మసీ కళాశాలల సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కే. రామదాసు మాట్లాడుతూ... గత 23 ఏళ్లుగా వికాస్ ఫార్మసీ కళాశాల...