Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్‌ రావాల్సిందే* *రైల్వే అభివృద్ధిలో సూర్యాపేటను విస్మరిస్తే ఉద్యమం ఉధృతం*.. *తెలంగాణగృహ కార్మికుల యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కాసా అనసూయ డిమాండ్.*

Author
Posted By RK SAKSHI
| 07 Oct 2026, 01:38 PM | TELANGANA
*సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్‌ రావాల్సిందే*    *రైల్వే అభివృద్ధిలో సూర్యాపేటను విస్మరిస్తే ఉద్యమం ఉధృతం*..   *తెలంగాణగృహ కార్మికుల యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కాసా అనసూయ డిమాండ్.*

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రం మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేసి, సూర్యాపేటలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష55 రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు బుధవారం తెలంగాణ గృహ కార్మిక యూనియన్ పాల్గొని సంపూర్ణమద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణగృహ కార్మిక యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కాసా అనసూయ పాల్గొనిమాట్లాడుతూ హైదరాబాద్–చెన్నై బుల్లెట్ ట్రైన్ మార్గంలో సూర్యాపేటను అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి బుల్లెట్ ట్రైన్ సౌకర్యం కల్పిస్తే జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు, వ్యాపారం, ఉపాధి, పరిశ్రమలు, విద్యా రంగాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని అన్నారు.రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి విషయంలో సూర్యాపేట జిల్లాకు తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్–సూర్యాపేట–చెన్నై బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు.సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ మార్గం సాధించే వరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని, అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కాసా అనసూయ పిలుపునిచ్చారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించేందుకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు గృహ కార్మికులు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గృహ కార్మిక యూనియన్ సూర్యాపేట పట్టణ అధ్యక్షురాలు సర్టు నీలిమ, ఉపాధ్యక్షురాలు నిమ్మల దివ్య, ప్రధాన కార్యదర్శి కోడూరి నిర్మల, సహాయ కార్యదర్శి మక్కా వరలక్ష్మి, సభ్యులు అనసూర్య స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.