Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*అండర్‌డ్రైనేజీ పనుల పేరుతో అవస్థలు* *మ్యాన్‌హోల్‌ మూతలు లేక ప్రమాదం.. చిన్నారులకు ముప్పు*

Author
Posted By RK SAKSHI
| 03 Oct 2026, 05:28 PM | TELANGANA
*అండర్‌డ్రైనేజీ పనుల పేరుతో అవస్థలు*  *మ్యాన్‌హోల్‌ మూతలు లేక ప్రమాదం.. చిన్నారులకు ముప్పు*

సూర్యాపేట: అండర్‌డ్రైనేజీ పనుల్లో జాప్యం జరుగుతోందని 47వ వార్డు కాలనీవాసి అంతటి విజయ్‌కుమార్‌ ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో తన నివాసం ఎదుట నిలబడి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్‌డ్రైనేజీ పనుల పేరుతో గుంతలు తీసి పూడ్చకుండా వదిలేస్తున్నారని తెలిపారు. 47వ వార్డు లోతట్టు ప్రాంతం కావడంతో చిన్న వర్షానికే మోకాళ్లలోతు నీరు చేరుతుందని, అయినా పనులను వేగంగా పూర్తి చేయకుండా ఎక్కడికక్కడ గుంతలు తీసి వదిలేస్తున్నారని వాపోయారు.మ్యాన్‌హోళ్ల కోసం గుంతలు తీసి నిర్మాణాలు చేపట్టినా వాటికి మూతలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదకరంగా మారాయని తెలిపారు. మూతలు లేకపోవడంతో ఇప్పటికే చిన్నారులు మ్యాన్‌హోళ్లలో పడిన ఘటనలు చోటుచేసుకున్నాయని, దీంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. వెంటనే మ్యాన్‌హోళ్లకు మూతలు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని కోరారు.అండర్‌డ్రైనేజీ పనుల సమయంలో పలు ఇళ్లకు సంబంధించిన వాటర్‌ పైప్‌లైన్లు ధ్వంసమయ్యాయని, వాటిని పునరుద్ధరించాలని కోరినా సంబంధిత సిబ్బంది స్పందించడం లేదని అన్నారు. దీంతో కాలనీవాసులే సొంత ఖర్చుతో పైప్‌లైన్లకు మరమ్మతులు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులను నాణ్యతతో, సమన్వయంతో చేపట్టి త్వరగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.