*అండర్‌డ్రైనేజీ పనుల పేరుతో అవస్థలు* *మ్యాన్‌హోల్ మూతలు లేక ప్రమాదం.. చిన్నారులకు ముప్పు*
సూర్యాపేట: అండర్‌డ్రైనేజీ పనుల్లో జాప్యం జరుగుతోందని 47వ వార్డు కాలనీవాసి అంతటి విజయ్‌కుమార్ ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో తన నివాసం ఎదుట నిలబడి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్‌డ్రైనేజీ పనుల పేరుతో గుంతలు తీసి పూడ్చకుండా వదిలేస్తున్నారని తెలిపారు. 47వ వార్డు లోతట్టు ప్రాంతం కావడంతో చిన్న వర్షానికే మోకాళ్లలోతు నీరు చేరుతుందని, అయినా పనులను వేగంగా పూర్తి చేయకుండా ఎక్కడికక్కడ గుంతలు తీసి వదిలేస్తున్నారని వాపోయారు.మ్యాన్‌హోళ్ల కోసం గుంతలు తీసి నిర్మాణాలు చేపట్టినా వాటికి మూతలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదకరంగా మారాయని తెలిపారు. మూతలు లేకపోవడంతో ఇప్పటికే చిన్నారులు మ్యాన్‌హోళ్లలో పడిన ఘటనలు...