Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*దామోదర్‌రెడ్డి స్ఫూర్తితో విద్యార్థులకు చేయూత *

Author
Posted By RK SAKSHI
| 02 Oct 2026, 08:14 AM | Politics
*దామోదర్‌రెడ్డి స్ఫూర్తితో విద్యార్థులకు చేయూత *

సూర్యాపేట: దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి స్ఫూర్తితో విద్యార్థులకు చేయూత అందించామని 11వ వార్డు రాయినిగూడెం కౌన్సిలర్‌ ఎల్గూరి ఇందిర వీరయ్యగౌడ్, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ఎలగబోయిన మధు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 11వ వార్డు రాయినిగూడెంలో దామోదర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దామోదర్‌రెడ్డి ప్రజాసేవకు అంకితమై పనిచేశారని, ఆయన సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ పేదలు, విద్యార్థులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. దామోదర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇమంపేట సర్పంచ్ నరిగె నాగేశ్వరి నాగరాజు, ఎలగబోయిన నాగరాజు, చారి, భాస్కర్, ఏడుకొండలు, సింగం నరేష్, కిరణ్, దొడ్డి కిరణ్, బాలయ్య, ఎల్లయ్య, రామరాజు, మామ శేఖర్, పాఠశాల ప్రిన్సిపాల్ మల్లె వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.