*దామోదర్‌రెడ్డి స్ఫూర్తితో విద్యార్థులకు చేయూత *

సూర్యాపేట: దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి స్ఫూర్తితో విద్యార్థులకు చేయూత అందించామని 11వ వార్డు రాయినిగూడెం కౌన్సిలర్‌ ఎల్గూరి ఇందిర వీరయ్యగౌడ్, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ఎలగబోయిన మధు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 11వ వార్డు రాయినిగూడెంలో దామోదర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దామోదర్‌రెడ్డి ప్రజాసేవకు అంకితమై పనిచేశారని, ఆయన సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ పేదలు, విద్యార్థులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. దామోదర్‌రెడ్డి...