Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులు అందించాలి ‍‍- ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి - మంజునాథ ట్రేడర్స్, సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ప్రారంభం

Author
Posted By RK SAKSHI
| 01 Oct 2026, 07:54 PM | BUSINESS
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులు అందించాలి ‍‍- ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి - మంజునాథ ట్రేడర్స్, సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ప్రారంభం

ఆత్మకూర్(ఎస్), రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందజేసి వారి మన్ననలు పొందాలని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని పాతర్లపహాడ్ క్రాస్ రోడ్డు సమీపంలో గుగులోతు జలేందర్ నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మంజునాథ ట్రేడర్స్ సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్” దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, జిల్లా నాయకులు మొరిశెట్టి లక్షాది, మండల పార్టీ అధ్యక్షులు ముసుకు రామచంద్రారెడ్డిలతో కలిసి మాట్లాడారు. సమాజానికే వెన్నుముఖ అయిన రైతులకు మేలు జరిగేలా వారికి కావాల్సిన విత్తనాలను నాణ్యతతో అందించాలన్నారు. పంట సాగులో పురుగుల మందు పిచికారి కోసం తమ వద్దకు వచ్చే రైతుల చేనులో ఏ రకమైన రోగం ఉందో..., పంట ఏ దశలో ఉందో... పూర్తి వివరాలు తెలుసుకొని అందుకు అనుగుణంగా నాణ్యమైన పురుగుల మందులను అందజేయాలన్నారు. వ్యవసాయ శాస్త్రావేత్తలు, వ్యవసాయ నిపుణుల సలహాలు, సూచనలుతో రైతులకు సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెన్నలపాండు నాయక్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుమూల సునీల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బాణోతు వాగ్య నాయక్, బాణోతు రవి నాయక్, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులు అందించాలి ‍‍- ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి - మంజునాథ ట్రేడర్స్, సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ప్రారంభం - Additional Image
అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.