రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులు అందించాలి ‍‍- ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి - మంజునాథ ట్రేడర్స్, సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ప్రారంభం

ఆత్మకూర్(ఎస్), రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందజేసి వారి మన్ననలు పొందాలని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని పాతర్లపహాడ్ క్రాస్ రోడ్డు సమీపంలో గుగులోతు జలేందర్ నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మంజునాథ ట్రేడర్స్ సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్” దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, జిల్లా నాయకులు మొరిశెట్టి లక్షాది, మండల పార్టీ అధ్యక్షులు ముసుకు రామచంద్రారెడ్డిలతో కలిసి మాట్లాడారు. సమాజానికే వెన్నుముఖ అయిన రైతులకు మేలు జరిగేలా వారికి కావాల్సిన విత్తనాలను నాణ్యతతో అందించాలన్నారు. పంట సాగులో పురుగుల మందు పిచికారి కోసం తమ వద్దకు...