Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*27న జడ్పీఎంపీహెచ్‌ఎస్‌ పూర్వ విద్యార్థుల 8వ వార్షికోత్సవ సదస్సు* *వివిధ రంగాల్లో రాణించిన పూర్వ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు: గుంటకండ్ల దామోదర్‌రెడ్డి*

Author
Posted By RK SAKSHI
| 19 Sep 2026, 05:24 PM | Bhakti
*27న జడ్పీఎంపీహెచ్‌ఎస్‌ పూర్వ విద్యార్థుల 8వ వార్షికోత్సవ సదస్సు*  *వివిధ రంగాల్లో రాణించిన పూర్వ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు: గుంటకండ్ల దామోదర్‌రెడ్డి*

సూర్యాపేట: సూర్యాపేట జడ్పీఎంపీ హైస్కూల్‌ పూర్వ విద్యార్థుల 8వ వార్షికోత్సవ సదస్సును ఈ నెల 27న ఘనంగా నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు గుంటకండ్ల దామోదర్‌రెడ్డి తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జడ్పీఎంపీ హైస్కూల్‌లో విద్యనభ్యసించి వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులను గుర్తించి ప్రతిభా పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లో వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన పలువురిని సన్మానించనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా, మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి విశిష్ట అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.
జడ్పీఎంపీ హైస్కూల్‌లో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కలుసుకోవడం సంతోషకరమన్నారు.పూర్వ విద్యార్థులందరూ సదస్సును ఆదరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తాటి చంద్రశేఖర్, కన్వీనర్ డాక్టర్ వేణుధర్, విద్యాసాగర్ డాక్టర్ పటేల్ నరసింహారెడ్డి, ఉపేందర్ రెడ్డి, చిలువేరు రఘురాం, రాఘవాచారి, మహేందర్ రెడ్డి, ముత్తంగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.