*27న జడ్పీఎంపీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల 8వ వార్షికోత్సవ సదస్సు* *వివిధ రంగాల్లో రాణించిన పూర్వ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు: గుంటకండ్ల దామోదర్‌రెడ్డి*
సూర్యాపేట: సూర్యాపేట జడ్పీఎంపీ హైస్కూల్ పూర్వ విద్యార్థుల 8వ వార్షికోత్సవ సదస్సును ఈ నెల 27న ఘనంగా నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు గుంటకండ్ల దామోదర్‌రెడ్డి తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జడ్పీఎంపీ హైస్కూల్లో విద్యనభ్యసించి వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులను గుర్తించి ప్రతిభా పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లో వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన పలువురిని సన్మానించనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి విశిష్ట అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. జడ్పీఎంపీ...