Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

సూర్యాపేట అభివృద్ధికి బుల్లెట్‌ ట్రైన్‌ ఎంతో అవసరం కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు యామ ప్రభాకర్‌

Author
Posted By RK SAKSHI
| 18 Sep 2026, 06:07 PM | TELANGANA
సూర్యాపేట అభివృద్ధికి బుల్లెట్‌ ట్రైన్‌ ఎంతో అవసరం  కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు యామ ప్రభాకర్‌

సూర్యాపేట: సూర్యాపేట అభివృద్ధికి బుల్లెట్‌ ట్రైన్‌ ఎంతో అవసరమని కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు యామ ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుల్లెట్‌ ట్రైన్‌ కోసం అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ కార్యక్రమానికి మెడికల్‌ షాపుల నిర్వాహకులు పూర్తి మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ ఏర్పాటు చేయడం వల్ల జిల్లాకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపార, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ కోసం చేపడుతున్న ప్రజా ఉద్యమానికి తమ సంఘం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిటికల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముషం హరిప్రసాద్, కార్యదర్శి ఊట్కూరు సైదులు, కోశాధికారి చామకూరి లింగయ్య, సభ్యులు ఎం.డి రఫీ, పణి, జి వెంకన్న, కృష్ణ, సోమ ప్రవీణ్, రాము, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.