సూర్యాపేట అభివృద్ధికి బుల్లెట్‌ ట్రైన్‌ ఎంతో అవసరం కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు యామ ప్రభాకర్‌

సూర్యాపేట: సూర్యాపేట అభివృద్ధికి బుల్లెట్‌ ట్రైన్‌ ఎంతో అవసరమని కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు యామ ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుల్లెట్‌ ట్రైన్‌ కోసం అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ కార్యక్రమానికి మెడికల్‌ షాపుల నిర్వాహకులు పూర్తి మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ ఏర్పాటు చేయడం వల్ల జిల్లాకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపార, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ కోసం చేపడుతున్న ప్రజా ఉద్యమానికి తమ సంఘం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిటికల్ డిస్ట్రిబ్యూటర్స్...