Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

నోఖా మున్సిపాలిటీలో సిపిఎం గెలుపు పట్ల హర్షం. సిపిఎం వాణిజ్య భవన్ శాఖా కార్యదర్శి బొమ్మిడి లక్ష్మి నారాయణ

Author
Posted By RK SAKSHI
| 17 Sep 2026, 04:41 PM |
నోఖా మున్సిపాలిటీలో  సిపిఎం గెలుపు పట్ల హర్షం.    సిపిఎం వాణిజ్య భవన్ శాఖా కార్యదర్శి బొమ్మిడి లక్ష్మి నారాయణ

సూర్యాపేట టౌన్ : రాజస్థాన్ రాష్ట్రంలోని నోఖా మున్సిపాలిటీలో 29 స్థానాలను గెలిచి అసమానమైన విజయాన్ని సాధించిన రాజస్థాన్ రాష్ట్ర పార్టీకి అభినందనలు తెలియజేస్తున్నామని సిపిఎం పార్టీ వాణిజ్య భవన్ శాఖా కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో రాజస్థాన్ రాష్ట్రంలోని నోఖా మున్సిపాలిటీలో సిపిఎం 29 కౌన్సిలర్ స్థానాలు గెలిచి మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్ర ప్రజలు ఎడారిలో ఎర్రజెండాను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. సిపిఎం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించడం ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న అవినీతి, మతోన్మాద రాజకీయాలను ప్రజల్లోకి తీసుకపోవడం ద్వారా విజయం సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్, బి ఆర్ఎస్, బిజెపి పార్టీలను ఓడించి ప్రజా సమస్యలపై నికరంగా పోరాడే సిపిఎం పార్టీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వాణిజ్య భవన్ శాఖ సభ్యులు త్రివేణి, ఆసిఫ్, యమునా తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.