నోఖా మున్సిపాలిటీలో సిపిఎం గెలుపు పట్ల హర్షం. సిపిఎం వాణిజ్య భవన్ శాఖా కార్యదర్శి బొమ్మిడి లక్ష్మి నారాయణ
సూర్యాపేట టౌన్ : రాజస్థాన్ రాష్ట్రంలోని నోఖా మున్సిపాలిటీలో 29 స్థానాలను గెలిచి అసమానమైన విజయాన్ని సాధించిన రాజస్థాన్ రాష్ట్ర పార్టీకి అభినందనలు తెలియజేస్తున్నామని సిపిఎం పార్టీ వాణిజ్య భవన్ శాఖా కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో రాజస్థాన్ రాష్ట్రంలోని నోఖా మున్సిపాలిటీలో సిపిఎం 29 కౌన్సిలర్ స్థానాలు గెలిచి మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్ర ప్రజలు ఎడారిలో ఎర్రజెండాను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. సిపిఎం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు...