Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ఏపూరి ఎర్ర సూర్యుడు. కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్. ఎం సిపిఐ యూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న.

Author
Posted By RK SAKSHI
| 17 Oct 2026, 12:41 PM | Politics
ఏపూరి ఎర్ర సూర్యుడు. కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్.  ఎం సిపిఐ యూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న.

ముఖ్యమైన పాయింట్స్:

  • 18 వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు.

సూర్యాపేట:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఏపూరి ఎర్ర సూర్యుడు ఎం సిపిఐ వ్యవస్థాపకులు అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఎక్స్ ఎమ్మెల్యే గారి 18వ వర్ధంతి శనివారం కామ్రేడ్ ఎస్కే. నజీర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో అమరజీవి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి మాజీ ఎంపీ గారి విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న మాట్లాడుతూ.. ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాడి ఆ పోరాటంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో కలిసి పది లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంచిన చరిత్ర ఓంకార్ గారిదన్నారు. ఐదుసార్లు నర్సంపేట ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర ప్రజల సమస్యల గురించి రెండున్నర గంటలు అనార్దళంగా మాట్లాడి అసెంబ్లీ టైగర్ గా పేరు తెచ్చుకున్నారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసుల హక్కుల కోసం అనగారిన కులాల కోసం అనేక పోరాటాలు నిర్వహించి తాను మరణించేంతవరకు సామాజిక న్యాయం కమ్యూనిస్టుల ఐక్యత కోసం కృషి చేశారని వెంకన్న అన్నారు. ఈ కార్యక్రమములో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లింగంపల్లి పంచాయతీ రాజ్, చందుపట్ల పవన్ కళ్యాణ్, నాయకులు గోపగాని లింగయ్య, వైభవ్, బండి శబరి, లక్ష్మణ్, శ్రీను,రాములు తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.