Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

దుర్గామాత దీవెనలతో ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి *మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బీరవోలు రవీందర్ రెడ్డి*

Author
Posted By RK SAKSHI
| 12 Oct 2026, 04:34 PM | Bhakti
దుర్గామాత దీవెనలతో ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి  *మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బీరవోలు రవీందర్ రెడ్డి*

సూర్యాపేట :
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సూర్యాపేట మండలం మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బీరవోలు రవీందర్ రెడ్డి ఆకాంక్షించారు. దుర్గామాత ఉత్సవాల సందర్భంగా సోలిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహానికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మాట్లాడారు. దుర్గ దేవి కరుణాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు.దసరా పండుగ ఆధ్యాత్మికతకు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐకమత్యం, సోదరభావం పెంపొందించుకుంటూ ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ,సుఖసంతోషాలతో పండుగలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోగి రెడ్డి వెంకట్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.