Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*నిరుపేద ధనలక్ష్మికి రూ.10 వేల ఆర్థిక సాయం* *ఆమె చికిత్సకు మరింత సహకారం అందించాలి: త్రీశక్తి వనిత గ్రూప్ అధ్యక్షురాలు జ్యోతి కృష్ణమూర్తి*

Author
Posted By RK SAKSHI
| 09 Oct 2026, 07:49 PM | HEALTH
*నిరుపేద ధనలక్ష్మికి రూ.10 వేల ఆర్థిక సాయం*  *ఆమె చికిత్సకు మరింత సహకారం అందించాలి: త్రీశక్తి వనిత గ్రూప్ అధ్యక్షురాలు జ్యోతి కృష్ణమూర్తి*

సూర్యాపేట: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద మహిళ ధనలక్ష్మికి త్రీశక్తి వనిత గ్రూప్ అండగా నిలిచింది. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో ధనలక్ష్మి కుటుంబానికి త్రిశక్తి వనిత గ్రూప్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి కృష్ణమూర్తి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుండటం బాధాకరమన్నారు. ఆక్సిజన్, మందుల కోసం ప్రతిరోజూ సుమారు రూ.2 వేల వరకు ఖర్చవుతోందని, ఇప్పటికే కుటుంబ సభ్యులు తమ స్థోమతకు మించి పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారని తెలిపారు. ప్రస్తుతం వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో కుటుంబం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ధనలక్ష్మికి మెరుగైన వైద్యం అందించేందుకు మా వంతుగా రూ.10 వేల సాయం అందించాం. అయితే, ఆమె చికిత్సకు ఇంకా ఆర్థిక సహాయం అవసరం. మానవతా దృక్పథంతో స్పందించి ధనలక్ష్మి కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం అందిస్తే ఆమె చికిత్సకు ఎంతో తోడ్పాటు లభిస్తుంది అని పేర్కొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.