ఉప్పల మల్సూరు కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడం ఎంసీపీఐ యూ పోరాట ఫలితమే. ఎం సిపిఐ యూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వరికుప్పల వెంకన్న
సూర్యాపేట : సూర్యాపేట తొలి శాసనసభ్యుడు అమరజీవి కామ్రేడ్ ఉప్పల మలుసూరు ఎక్స్ ఎమ్మెల్యే గారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయటం ఎం సిపిఐయు పోరాట ఫలితమే అని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న అన్నారు. ఎం సిపిఐయు ఆధ్వర్యంలో అనేక సందర్భాలలో వారి కుటుంబ పరిస్థితులపై కుటుంబ సభ్యులను తీసుకుని కలెక్టర్ల గారిని ప్రజా ప్రతినిధులను స్వయంగా కలిసిన విషయం మీడియా మిత్రులకు ప్రజలకు తెలుసునని వినతి పత్రాలు అర్జీలు సమర్పించడం జరిగిందని వెంకన్న అన్నారు.1952 నుండి 1972 వరకు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్నికై తాను నమ్ముకున్న వృత్తిని కొనసాగిస్తూ 1995లో సిరికొండ గ్రామానికి సర్పంచిగా ఏకగ్రీవంగా...