*షటిల్ క్రీడాకారుల కోసం ఉచిత గుండె వైద్య శిబిరం.* *క్రీడాకారుల ప్రాణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ.. ముందస్తు గుండె పరీక్షలతో భరోసా కల్పించిన డా. రామ్మూర్తి యాదవ్.*
సూర్యాపేట : నిత్యం తమతో కలిసి షటిల్ ఆడుతూ, నవ్వుతూ, సరదాగా గడిపిన తోటి క్రీడాకారుడు వెలుగు కర్ణాకర్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందడం సహచర క్రీడాకారులను తీవ్ర విషాదానికి గురిచేసింది. కళ్లముందే తిరిగిన ఆత్మీయ క్రీడాకారుడు ఇక లేడనే వార్త అందరినీ కలచివేసింది. ఇలాంటి విషాదకర పరిస్థితి మరే క్రీడాకారుడి కుటుంబంలోనూ చోటుచేసుకోకూడదనే మానవీయ ఆలోచనతో గాయత్రి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డా. ఊర రామమూర్తి యాదవ్ ముందడుగు వేశారు. తోటి క్రీడాకారుల ఆరోగ్యమే తన ఆరోగ్యంగా భావిస్తూ, షటిల్ ఆడే ప్రతి ఒక్కరూ గుండె సంబంధిత సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్వీ ఆసుపత్రిలో ఉచిత గుండె...