*రైతు పండించినవరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలి..* *కొనుగోలుదారుల దోపిడీని అరికట్టాలి.* *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్.*

సూర్యాపేట: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం తీసుకొస్తున్న రైతులకు తక్షణమే కనీస మద్దతు ధర కల్పించి, కొనుగోలుదారుల దోపిడీని అరికట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం శ్రమించి, పెట్టుబడులు పెట్టి పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొస్తే కనీస ధర కూడా దక్కని పరిస్థితి నెలకొనడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.గత వారం రోజులుగా సూర్యాపేట మార్కెట్‌కు వరి ధాన్యం వస్తున్నప్పటికీ, రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్వింటా ధాన్యానికి గతంలో రూ.3,500 వరకు ధర పలుకుతుండగా, గురువారం ఒక్కసారిగా రూ.2,000కే కొనుగోలు...