పేద ఆర్యవైశ్యులకు బాసటగా శ్రీ వాసవి రక్షణ కవచం
సూర్యాపేట : పేద ఆర్యవైశ్యులకు బాసటగా శ్రీ వాసవి రక్షణ కవచం నిలుస్తుందని శ్రీ వాసవి రక్షణ కవచం గౌరవ సలహాదారులు తప్సీ గాంధీ, కలకోట లక్ష్మయ్య, చల్లా సత్యనారాయణ లు తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి సేవాసమితి కార్యాలయంలో సూర్యాపేటకు చెందిన పేద ఆర్య వైశ్యులు బెలిదే చంద్రశేఖర్ , పద్మ దంపతులకు పదివేల రూపాయల విలువగల సైకిల్, బీరువా, రెండు వాటర్ క్యాన్లు శ్రీ వాసవి రక్షణ కవచం వ్యవస్థాపకులు బచ్చు పురుషోత్తం తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేటలో శ్రీ వాసవి రక్షణ కవచం స్థాపించి ఆర్యవైశ్యుల నుండి ప్రతినెలా వంద రూపాయలు...