- *పోలీసు అమరులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి.* - *పోలీసు త్యాగాలకు గౌరవంగా ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి.* నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా. *బైక్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న పట్టణ పౌరులు, యువత*
సూర్యాపేట : పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఖమ్మం చౌరస్తా నుండి పిఎస్ఆర్ సెంటర్, కోర్టు చౌరస్తా మీదుగా ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల చౌరస్తా వరకు పోలీసు అమరుల సంస్మరణ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ అధికారులతో కలిసి జిల్లా కేంద్రం లోని ఖమ్మం చౌరస్తా వద్ద బైక్ ర్యాలీ ప్రారంభించారు. పిఎస్అర్ సెంటర్, కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా మీదుగా ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వరకు జరిగినది. ఎస్వీ కళాశాల వద్ద పౌరులతో కలిసి జై జావాన్ , జై కిసాన్, జై పోలీస్ అంటూ, పోలీసు అమరవీరుల...