- రక్తదానం ప్రాణదానం తో సమానం - పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా రక్తదానం కార్యక్రమం ఏర్పాటు. - సేవా కార్యక్రమాలలో పోలీసు ముందడుగు. నరసింహ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా.
సూర్యాపేట : పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగాల జ్ఞాపకార్థం సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ రక్తదాన శిబిరం నందు జిల్లా ఎస్పీ పాల్గొని మొదటగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్పి గారి వెంట డీఎస్పీ నరసింహ చారి, నాగారం సిఐ నాగేశ్వరరావు, సిఐ లు రామారావు, శివ కుమార్, ఆర్ఐ లు ప్రవీణ్, జానయ్య, ఎస్ఐ లు సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పౌరులు పాల్గొని వారి రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు మాట్లాడుతూ...