కలలకు జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది పేటలో అలరించిన స్వర గానామృతం గాయకులకు షీల్డ్ లు అందజేసి సత్కరించిన ప్రముఖ వైద్యులు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్
సూర్యాపేట : సమాజంలో అంతరించిపోతున్న కలలకు జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నేడు ఆపాత మధురాలను గుర్తు చేస్తూ స్వర గానామృతం నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో జ్ఞాన సరస్వతి కళావేదిక, జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర గానామృతం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి గాయకులకు షీల్డులు ప్రశంస పత్రాలు అందజేసి సత్కరించారు. ఆనాటి పాటలు ఎంతో మధురమైనవని చెవులకు వినసొంపుగా ఉండే ఆ పాత మధురాలను మళ్లీ వినిపించిన జ్ఞాన సరస్వతి కళావేదికను ఆయన అభినందించారు. ఇలాంటి...