కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట : ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రైతులు ఆరుతడి పంటలైన కూరగాయలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందించే రాయితీలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో రెండు ఎకరాల్లో వంగ, మునగ తోటలు సాగు చేస్తున్న బోయపల్లి సరోజ వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు. వంగ, మునగ సాగులో లాభనష్టాలను రైతును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన బిందు సేద్యం పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎరువులను ఏ విధంగా అందిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు....