*ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు కావాలి* తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట: అర్హులైన ప్రతి పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 15వ వార్డులో కౌన్సిలర్ పిల్లల భవాని రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదితతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల నమోదుపై అవగాహన...